Ipl 2022 : ముంబై కెప్టెన్ రోహిత్‌ శర్మకు రూ.12 లక్షల భారీ జరిమానా

-

ఐపీఎల్ లో నిన్న సాయంత్రం పూట జరిగిన మ్యాచ్‌ లో ముంబై ఇండియ‌న్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్.. చివ‌రికి ఢిల్లీ విజ‌యం సాధించింది. 178 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంత్ సేన మొదట్లో త‌డ‌ప‌డింది. ఓపెన‌ర్లు పృథ్వి షా (38), టిమ్ సీఫెర్ట్ (21) ప‌ర్వలేద‌నిపించినా.. మ‌న్ దీప్ సింగ్ (0), పంత్ (1), రోవ్ మన్ పావెల్ (0) వ‌రుస‌గా పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు.

ఈ స‌మ‌యంలో ఢిల్లీ విజ‌యం సాధించ‌డం క‌ష్టమే అనుకున్నారు. దీంతో ముంబైపై ఢిల్లీ విజయం సాధించింది. అయితే.. ఢిల్లీతో తలపడిన ఈ మ్యాచ్‌ లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఏకంగా.. రూ.12 లక్షలు జరిమానా విధించినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ సీజన్‌ లో స్లో ఓవరన్‌ రేట్‌ కారణంగా..జరిమానా పడిన తొలి కెప్టెన్‌ గా ముంబై సారధి రోహిత్‌ శర్మ నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news