ఆస్ట్రేలియా సంధించిన 353 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇండియా ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లుగా వచ్చిన వాషింగ్ టన్ సుందర్ మరియు రోహిత్ శర్మ కు మంచి బంతులను గౌరవిస్తూ, చెడు బంతులను బౌండరీలు తరలిస్తున్నారు.. మొదట్లో తడబడిన రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసపెట్టి సిక్సులు ఫోర్లతో ఆస్ట్రేలియా పై ఎదురుదాడి చేశాడు.. ఈ దశలో రోహిత్ శర్మ కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు. రోహిత్ తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు మరియు 5 సిక్సులు ఉన్నాయి. మొదటి పది ఓవర్ లలో వికెట్ పడకుండా ఆడిన ఓపెనర్లు 11వ ఓవర్ లో మాక్స్వెల్ బౌలింగ్ లో సుందర్ అనవసర షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీనితో పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 55 పరుగులతో ఆడుతున్నాడు..
ఇతను ఇదే విధంగా తన ఇన్నింగ్స్ కొనసాగిస్తే ఈ టార్గెట్ ను ఉఫ్ మని ఊదేస్తాడు. ఇక వికెట్ పడింది కాబట్టి ఇండియా జోరు తగ్గిస్తారా లేదా అదే వేగంతో దూసుకువెళుతారా చూడాలి.