రెండు రోజుల్లో ఆసియా కప్ మరియు రెండు నెలల్లో వరల్డ్ కప్ ఉండడంతో విరామం లేకుండా ఇండియా జట్టు క్రికెట్ ఆడనుంది. కాగా ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మీడియా తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన విషయాన్ని పంచుకున్నాడు. రోహిత్ మాట్లాడుతూ … 2011 వన్ డే వరల్డ్ కప్ సమయంలో టీం అనౌన్స్మెంట్ జరిగింది , నాకు అవకాశం వస్తుంది అని ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ చోటు దక్కలేదు, దీనితో నేను ఎంతో కృంగిపోయాను .. గదిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాను. ఆ పరిస్థితుల్లో యువరాజ్ సింగ్ నా దగ్గరకు వచ్చి, ఈ విషయంలో నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు కస్టపడి నువ్వు ఏమిటో నిరూపించుకుంటే ఎవ్వరూ నీ ఎంపికను ఆపలేరు అంటూ నన్ను ఓదార్చి నాలో ఆత్మస్తైర్యాన్ని నింపాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు రోహిత్ శర్మ.
అందుకే నాకు జట్టులో చోటు దక్కకకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసు అంటూ రోహిత్ శర్మ చెప్పాడు.