IPL తర్వాత డిసైడ్‌ చేస్తా..రిటైర్మెంట్‌ పై రోహిత్‌ శర్మ కీలక ప్రకటన

-

ఇవాళ ఇండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కు రోహిత్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. అలాగే, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీ 20 సిరీస్‌ విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్‌ ను కూడా కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే, శ్రీలంకతో వన్డేకు ముందు టి20 క్రికెట్ పై స్పందించిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం గురించి ఏం ఆలోచించలేదని, బహుశా ఐపిఎల్ 2023 తర్వాత, ఆ విషయం గురించి ఆలోచిస్తానని చెప్పాడు. దీంతో రోహిత్, పాండ్యాకు టి20 కెప్టెన్సీ ఇచ్చేందుకు సిద్ధంగా లేడనే విషయం స్పష్టమైంది. అలాగే, టీమ్ ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బూమ్రా వన్డే సిరీస్ కు దూరంగా ఉండటం టీమ్ కు దెబ్బేనన్న రోహిత్, బూమ్రా ఎన్సిఏలో చాలా కష్టపడుతున్నాడని పేర్కొన్నాడు. అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news