ప్రపంచ వ్యాప్తంగా ఖడ్గ మృగాలను కాపాడాలి అని పలువురు క్రీడా ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అందరూ కూడా వాటి ఉనికిని కాపాడాలి అని కోరుతున్నారు. ఆ జాబితాలో టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా జాయిన్ అయ్యాడు. రైనోలను రక్షించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాడు. మన దేశంలోని కొమ్ము ఖడ్గమృగాలు మన దేశానికి మాత్రమే సొంతం.
ఒకప్పుడు ఇవి లక్షల్లో ఉండేవి. ఇప్పుడు మాత్రం వాటి సంఖ్య కేవలం 20 వేలు లోపే ఉంది. దీనితో ఇవి అంతరించి పోయే జాబితాలో చేరాయి. ఇవి బ్రతకాలి అంటే అడవుల్లో భాగమైన అల్యూవియల్ గడ్డి మైదానాల్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గడ్డి లేకపోవడం వల్ల చాలా ఖడ్గమృగాలు చనిపోతున్నాయని అధికారులు గుర్తించారు. దీనితో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)ఇండియా ఆ మైదానాలను పెంచే విధంగా,
కీలక అడుగులు వేస్తూ సహకారం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అయితే వేటగాళ్ళు కూడా వీటికి శాపంగా మారిపోయారు. దీనితో రోహిత్ సాయం తీసుకుంటున్నారు. అతని ద్వారా ప్రచారం చేయిస్తూ wwf. దీనిపై స్పందించిన రోహిత్… ఖడ్గమృగాల్ని కాపాడదామని విరాళాలు ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్‌ని కోరుతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో రోహిత్ పోస్ట్ కూడా పెట్టాడు.