రెండు చోట్ల ఓడిపోయాడు..మమ్మలని విమర్శిస్తున్నాడు..అసలు సొంత ప్రజలే ఓడించాడు…ఇంకా ఎన్ని చోట్ల పోటీ చేసిన ఓడిస్తారు..ఇది పవన్ గురించి వైసీపీ నేతలు పదే పదే చేసే కామెంట్లు. నిజమే పవన్ తొలిసారి ఎన్నికల బరిలో దిగి రెండు చోట్ల ఓడిపోయారు. అయితే రాజకీయాల్లో ఓడిపోతే ఇంకా వారు ఎందుకు పనికిరారు అన్నట్లుగా వైసీపీ నేతలు ఎగతాళి చేయడం అనేది కరెక్ట్ కాదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఒకటి రెండుసార్లు ఓటమి గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది గాని..పదే పదే అలా మాట్లాడటం వల్ల ఇంకా పవన్‌పై ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు వైసీపీ నేతలు అదే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
అయితే తనని ఓడిపోయారని ఎగతాళి చేయడంపై తాజాగా పవన్ స్పందించారు. అవును రెండు చోట్ల ఓడిపోయానని, ప్రజలు పూర్తి మద్ధతు దక్కలేదని అన్నారు. కానీ ఓడిపోయానని కొందరు నేతలు మాటలు మాట్లాడుతుంటే ఎబ్బెట్టుగా ఉందన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఇటీవల రోజా …పవన్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక రోజా కూడా తన గురించి మాట్లాడుతుందని, అంటూ ఆమెపై సెటైర్లు పేల్చారు. అటు అంబటి రాంబాబుపై కూడా విరుచుకుపడ్డారు.
ఇదే క్రమంలో రోజా, రాంబాబు సైతం పవన్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. రెండుచోట్ల ఓడిపోయిన పవన్..రెండుచోట్ల గెలిచిన తన గురించి మాట్లాడటమా అంటూ మళ్ళీ ఫైర్ అయ్యారు. ఇక పీకే అంటే పిచ్చి కుక్క అంటూ అంబటి ఫైర్ అయ్యారు. అయితే గెలుపోటములు అనేవి సహజమే. రోజా కూడా గతంలో రెండుసార్లు ఓడిపోయారు. రెండు సార్లు గెలిచారు. ఇక రెండుసార్లు కూడా స్వల్ప మెజారిటీలతో గెలిచి బయటపడ్డారు. ఇక అంబటి 1989లో ఒకసారి మళ్ళీ 2019 ఎన్నికల్లో మాత్రమే గెలిచారు. అంటే గెలుపు ఎవరికి శాశ్వతం కాదు.