ఒంగోలు నుంచి నేను చేయడం లేదు.. నగరి నుంచే పోటీ చేస్తానని చెప్పకనే చెప్పారు మంత్రి రోజా. ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు…నగరి లో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు రోజా. టిడిపి, జన సేనకు అభ్యర్థులు లేరు.. పెద్దిరెడ్డి గురించి ఆదిమూల0 మాటలు బాధ పెట్టాయన్నారు. ఆయన్ను గెలిపించింది పెద్దిరెడ్డి… కక్ష సాధింపు గా ఆయన మాట్లాడారని ఫైర్ అయ్యారు.
వైసీపీ పార్టీలో మార్పులు, చేర్పులు అర్థం చేసుకోవాలి…సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం కావడం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారు…ఆదిమూల0 రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని ఫైర్ అయ్యారు.నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతూన్నారు.. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుందన్నారు.చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడు… చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడని మండిపడ్డారు.