నాపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని ఏపీ మంత్రి రోజా సంచలన పోస్ట్ పెట్టారు. “జీవితంలో మన ఎదుగుదలని కించపరిచేవారు ఉంటారు అభినందించేవారు ఉంటారు, మన ఎదుగుదల మన చేతిలోనే ఉంటుంది” అంటూ రోజా పేర్కొన్నారు. రాస్ ఆధ్వర్యంలో పుత్తూరులో జరిగిన మహిళాదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రాస్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతం మరియు వృద్దులకి దుప్పట్లు చేతికర్రలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా.. ఆసక్తి కర పోస్ట్ పెట్టింది.
“ నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను హీరోయిన్ గా, నాయకురాలిగా, మంత్రిగా మీ ముందుకి రావడం వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు పడ్డాను అవన్ని ఎదుర్కొన్నాను, నా జీవితం తెరిచిన పుస్తకం, నిజానికి నాకు సినిమాల్లో అనుకోకుండా అవకాశం వచ్చినా, ఎన్నో అవాంతరాలు ఎదురైనా 150 సినిమాల్లో నటించ్చాను దానికి కారణం సినిమాలు తీసిన దర్శక నిర్మాత లు ఆదరించిన ప్రజలు. నన్ను రాజకీయాల్లో వార్డు సభ్యురాలిగా కూడా గెలవలేనని, ఐరన్ లెగ్ అనే ముద్ర వేయడానికి కూడా ప్రయత్నించారు పట్టుదలతో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మీ ముందు నిలిచి ఉన్నానంటే దీనికి కారణం ప్రజలను నమ్ముకోవడం, ప్రతిభతో పాటు పట్టుదల కలిగి ఉండడమే.“ అంటూ ఎమోషనల్ అయింది రోజా.