విశాఖలో రోజ్ గార్ మేళా.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

-

విశాఖ సాగర్ మాల కన్వెన్షన్ లో రోజ్ గార్ మేళా నిర్వహించారు.  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఎంపికైన ఉద్యోగులకు అపాయింట్ మెంట్ లెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అన్ని రంగాల్లో ఏపీ టాప్ లో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసిన ప్రతి ఒక్కరూ దేశసేవ చేసినట్టేనని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని హోం, తపాలా, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజ్ గార్ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా 71 వేల మంది యువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో ఈ రోజ్ గారి మేళా నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని మోడీ వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయా కేంద్రాల్లో కేంద్ర మంత్రులు ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. విశాఖలో నిర్వహించిన రోజ్ గారి మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసి ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Latest news