RRR: రికార్డులు తిరగరాస్తున్న ‘ఆర్ఆర్ఆర్’.. మూడో రోజు భారీ కలెక్షన్స్..

-

సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలై రికార్డుల వేటలో తలమూనకలైంది. ఈ ఫిల్మ్ చూసి ప్రజలు రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కొనియాడుతున్నారు. ఆయన తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మాస్టర్ స్టోరి టెల్లర్ అని పేర్కొంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం విడుదలైన తొలి రోజునే అత్యధిక కలెక్షన్స్ చేసి రికార్డు సృష్టించింది.

రూ.223 కోట్లను ఫస్ట్ డే కలెక్ట్ చేసి ‘బాహుబలి’ రికార్డును బీట్ చేసింది. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా చక్కటి స్పందన వస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు.

ఇకపోతే విదేశాల్లో ఓవర్సీస్ రిలీజెస్ లోనూ ఈ పిక్చర్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాలోనే కాకుండా విదేశాల్లోనూ సినిమాను విశేషంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ రికార్డుల ప్రభంజనం మూడో రోజు కొనసాగుతోంది. మూడు రోజు కలెక్షన్స్ గురించి ఇప్పటికి ట్రేడ్ అనలిస్ట్‌ల నుంచి అందిన సమాచారం ప్రకారం మూడో రోజు తెలంగాణలో రూ.15 కోట్లు, సీడెడ్‌లో రూ.6 కోట్లు, కృష్ణాలో రూ.2 కోట్లు, యూఏలో రూ.3.9 కోట్లు, గుంటూరులో రూ.1.9 కోట్లు, వెస్ట్, ఈస్ట్ గోదావరి కలిపి రూ.2.6 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ.33 కోట్ల షేర్ వసూలు అయింది.

నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తమ భుజాన మోస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ చిత్రాన్ని గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు్న్నారు. రాజమౌళి వంటి దర్శకుడితో పని చేయాలని అనుకుంటున్నారు కూడా. ఆయన చిత్రంలో చిన్న పాత్ర అయినా సరే చేయడానికి వెనుకాడబోమని పేర్కొంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ కీలక పాత్రలు పోషించారు. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news