RRR Glimpse Review: దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. అందులోనూ ఇప్పడు మల్టీస్టారర్.. అది కూడా చిన్న హీరోలతో కాదు. ఒకరు మెగాపవర్ స్టార్ మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వారికి తగ్గట్టుగానే మూవీ టైటిల్ కూడా ఓ రేంజ్లో ఉంది అదే ఆర్ఆర్ఆర్ ( రణం రౌద్రం రుధిరం). చరిత్రలో గతి తిరుగరాసిన మహా వీరుల చరిత్రనే ఈ చిత్రం. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ చిత్రం ఎప్పుడూ విడుదల అవుతుందా అని యవత్తు సినీ ప్రపంచ వేచి చూస్తుంది.
ఈ క్రమంలో ఒక్కో అప్‌డేట్ ను వదులుతు ప్రేక్షక లోకంలో పూనకాలు తెప్పిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన ఆర్ ఆర్ ఆర్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్ వచ్చింది. రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు వీడియోస్ మెగా, నందమూరి అభిమాన వర్గాలను హుషారెత్తించాయి.
తాజాగా.. ఆర్ ఆర్ ఆర్ నుంచి గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు జక్కన్న అండ్ టీం. కేవలం 45 సెకనులున్న టీజర్ మరో సారి రికార్డుల సునామీని సృష్టిస్తుందటంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ గ్లింప్ మేకింగ్ అద్బుతమనే చెప్పాలి. ఈ చిత్రంలోని భారీ యాక్షన్ సీనులను ముందుగానే కండ్లకు కట్టినట్టు చూపించారు. యాక్షన్ సీన్స్ ను రక్తికట్టించడం కోసం భారీ సెట్లు.. వేలాది మంది జూ. ఆర్టిస్టులను వాడినట్టు అర్థమవుతుంది. ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం లుక్స్ తోనే మనసుని తాకే భావోద్వేగాల్ని పలికించారు. నటుల ఎమోషన్స్ ను హైలెట చేశారు.
ఈ ఒక్క టీజర్ చాలు.. సినిమా ఏ రెంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఎప్పటి నుంచో ఈ గ్లింప్స్ కోసం
వేచి చూస్తున్న మెగా, నందమూరి అభిమానులకు ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. గూస్‌బంప్స్ తెప్పించే ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు జక్కన్న.
మరో సారి కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అని చెప్పాలి. ప్రతి సీన్ కు తగ్గట్టుగా కీరవాణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటుంటే.. రోమాలు నిక్కబొడిస్తున్నాయి. ఈ గ్లింప్ తో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు వచ్చాయి. ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తాడనడంలో ఎలాంటి అతియోశక్తి లేదు. ఈ చిత్రాన్ని 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యారు జక్కన్న అండ్ టీం. ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ దసరాకే సినిమాను విడుదల చేయాలని తొలుత భావించినా కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేశారు.