ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి ఫిక్షనల్ కథతో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీం గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించి మెప్పించారు. అయితే అసలు జరిగిన దానికి ఈ కథ పూర్తి డిఫరెంట్ .. ఎక్కువగా వివాదాలకు తావు ఇవ్వకుండా కల్పితాలుగా సినిమాను తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కూడా పోటీపడి మరీ నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న లిస్టులో ఈ ఇద్దరు హీరోలు కూడా చేరిపోవడం తెలుగు ఖ్యాతికి గర్వకారణం..
ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా దేశవ్యాప్తంగా అరుదైన రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఇతర దేశాలలో కూడా మంచి రెస్పాన్స్ పొందుతోంది ఈ సినిమా. ఇదిలా ఉండగా తాజాగా జపాన్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. నిన్నటి వరకు రామ్ చరణ్ , ఎన్టీఆర్, రాజమౌళి తమ ఫ్యామిలీలతో కలిసి సినిమాలు ప్రమోట్ చేయడంతో ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయింది.జపాన్ లో చరణ్ , తారక్ లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అక్కడి అభిమానులు.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఎట్టకేలకు ఈరోజు జపాన్ లో విడుదలైన ఈ సినిమాకి అక్కడ భారీ రెస్పాన్స్ వస్తోంది . మొదటి రోజే ఏకంగా రూ.25 కోట్ల కలెక్షన్ వసూలు చేసిందని టాక్. ఇండియాలో విడుదలయ్యి 7 నెలలకు పైగా అవుతున్నా.. ఇప్పటికీ కూడా క్రేజ్ తగ్గడం లేదు.. తప్పకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని హాలీవుడ్ మ్యాగజైన్ సైతం చెబుతున్నాయి. ఇక ఆస్కార్ అవార్డు లభిస్తే ఈ సినిమాలో నటించిన నటీనటులకే కాదు తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి కూడా పెరిగిపోతుంది.