RRR Movie : చరణ్‌, తారక్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఫోటో రిలీజ్

-

“ఆర్‌ఆర్‌ఆర్‌” సినిమా కోసం చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అలాగే.. యంగ్ టైగ్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీగా అంచ‌నాలు పెరిగి పోయాయి. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా కు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌ల పోస్ట‌ర్లు..టీజ‌ర్లు సినిమాపై అంచ‌నాలు పెంచాయి.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మహా శివరాత్రి నేపథ్యంలో.. ఓ అదిరిపోయే ఎక్స్‌క్లూజివ్‌ ఫోటో ను వదిలింది చిత్ర బృందం. ఈ ఎక్స్‌క్లూజివ్‌ ఫోటో లో రామ్‌ చరన్‌, ఎన్టీఆర్‌ తలో దిక్కు పడుకుని ఉన్నారు. అంతేకాదు.. వీరిద్దరూ మొబైల్‌ పట్టుకుని ఫుల్‌ బిజీగా ఉన్నట్లు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా.. మార్చి 25 వ తేదీన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news