గత సంవత్సరం మార్చి లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యనే నాటు నాటు సాంగ్ కు కూడా ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ సినిమా గురించి తాజాగా రచయిత మరియు డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ కు రానున్న రోజుల్లో సీక్వెల్ ను తెరకెక్కిస్తామని తెలియచేశాడు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుంది అని ఆనందంగా చెప్పాడు, అయితే ఈ సినిమాకు రాజమౌళి డైరెక్టర్ గా వ్యవహరించవచ్చు లేదా రాజమౌళి పర్యవేక్షణలో ఇంకెవరైనా డైరెక్టర్ గా చేయవచ్చని హింట్ ఇచ్చాడు. ఇక ఈయన మాటలను బట్టి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అర్ధమయింది.
అయితే ఇందులో హీరోలుగా ఎవరు ఉంటారు ? తారాగణం ఏమిటి అన్న విషయాలు తెలియాల్సి ఉంది.