ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏదైనా ఉంది అంటే.. అది ఎటువంటి కల్మషం లేని ప్రేమ అని చెప్పాలి. తల్లి బిడ్డ ప్రేమ, తండ్రి బిడ్డ ప్రేమ , లేదా ప్రేయసి ప్రేమికుడు ప్రేమ ఇలా చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రేమ గురించి మరొక్క సారి మాట్లాడుకునే అవకాశాన్ని ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని ఇచ్చాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇటలీని ఎక్కువకాలం పాటు పాలించిన ప్రధాని సిల్వియో బెర్లుస్కోని ఈ మధ్యనే మరణించిన సంగతి తెలిసిందే. కాగా తన పదవీకాలంలో ఉండగా వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. అయితే తాను బ్రతికున్న సమయంలో తన పేరిట ఉన్న ఆస్తులను ఎవరికి చెందాలో ఒక వీలునామా రాసిపెట్టాడు. తాజాగా అందులో నుండి బయటపడిన ఒక విషయం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. సిల్వియో తాను ప్రేమించిన 33 సంవత్సరాల లవర్ కోసం ఏకంగా రూ. 900 కోట్ల విలువైన ఆస్తిని తనకు చెందాలని రాశాడట. ఈ విషయం ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని మీడియా మరియు వార్త పత్రికలలో వైరల్ గా మారుతోంది.
ఈయన అంత విలువైన ఆస్తిని రాశాడంటే… ఆమెను ఎంతగా ప్రేమించాడో ? ఆరాధించాడో ? క్లియర్ గా అర్ధమవుతోంది. దీన్ని చదివిన వారంతా వీరిద్దరిది అమరమైన ప్రేమ అంటూ కితాబిస్తున్నారు.