టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు..

తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించిన అంశం.. డ్రగ్స్ కేసు. టాలీవుడ్ లో ప్రఖ్యాత డైరెక్టర్లు, యాక్టర్లు సహా హీరోయిన్ల పేర్లు కూడా ఇందులో వినిపించాయి. పోలీసుల విచారణకు హాజరయ్యారు కూడా. కొన్ని రోజులు హాడావిడి జరిపిన ఈ వార్తా, ఆ తర్వాత తెరమరుగైపోయింది. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు తెలుస్తుందని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి.

కేసులో విదేశీయులు ఉండడంతో మనీ లాండరింగ్ జరిగి ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలుస్తుంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుండి ఈడీ పూర్తి వివరాలు తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ డ్రగ్స్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ అంశం ఎటు వైపు తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.