పైరసీ బారిన ‘ఆర్ఆర్ఆర్’… విడుదలైన కొన్ని గంటల్లోనే వెబ్ సైట్లలో ప్రత్యక్షం

-

దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మూవీ ‘ ఆర్ఆర్ఆర్’. మార్చి 25 న గ్రాండ్ గా విడుదలైంది. ఎన్నో ఎళ్లుగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా రావడంతో సినిమాపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే అంచనాలను అందుకున్న విధంగానే టాక్ వస్తోంది.

ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ సినిమాకు పైరసీ దెబ్బ తగిలింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే తమిళ్ రాకర్స్ వంటి పైరసీ ఆధారిత వెబ్ సైట్ లో సినిమా ప్రత్యక్షం అయింది. పైరసీని ఎంకరేజ్ చేయవద్దని రామ్ చరణ్, ఎన్టీఆర్ కోరుతున్నారు. అయితే ఈ పైరసీపై ట్రిపుల్ ఆర్ టీం ఎలా రియాక్ట్ అవుతోందో చూడాలి.

ఇదిలా ఉంటే ఇంతకు ముందు కూడా పుష్ప, అఖండ, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు, డీజే టిల్లు, ఖిలాడీ, రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి సినిమాలు కూడా ఇలానే పైరసీ బారినపడ్డాయి. ఉప్పెన సినిమా అయితే ఆన్‌లైన్‌లో తమిళ్‌రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రూల్జ్ మరియు ఇతర టొరెంట్ సైట్‌లలో HD నాణ్యతతో లీక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news