రాజమౌళి సార్ మిమ్మల్ని చూడాలంటే తలెత్తాల్సిందే.. ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడిని ఆకాశానికెత్తిన సుకుమార్..

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన కళా ఖండం ‘ఆర్ఆర్ఆర్’ దుమ్ము రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇక ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరు రాజమౌళికి సెల్యూట్ కొడుతున్నారు. జక్కన్న టేకింగ్, హీరోల పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని అంటున్నారు.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. రాజమౌళి ప్రతిభను ప్రశంసిస్తూ, మూవీ యూనిట్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రోమాలు నిక్కబొడుచుకునేలా క్రియేటివ్ గా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు పెట్టాడు. అది నెట్టింట వైరలవుతోంది.

ఇటీవల ‘పుష్ప’ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసి సక్సెస్ అయిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ఫిల్మ్, రాజమౌళి గురించి ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు చూసి సుకుమార్ రాజమౌళి గొప్పతనాన్ని అత్యద్భుతంగా అభివర్ణించారని సినీ లవర్స్ పేర్కొంటున్నారు.

‘మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్.. మీకూ, మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే’ అని సుకుమార్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ పోస్టు చూసి రాజమౌళి స్పందించారు. సుక్కు ఇంతటి అప్రిసియేషన్‌కు థాంక్స్ అని కామెంట్ చేశాడు. మొత్తంగా రాజమౌళి తీసిన నెక్స్ట్ లెవల్ చిత్రానికి సుక్కు నెక్స్ట్ లెవల్ లోనే ప్రశంసించాడని మెగా, నందమూరి అభిమానులు అంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news