వివేకా కేసు తేలడానికి రెండేళ్లు పడుతుంది – RRR

-

 

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తేలడానికి రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉందని, ఈలోగా ఎన్నికలు వస్తే అవినాష్ రెడ్డి గారిని జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్యాయంగా కేసులోకి లాగారని ప్రజలను మభ్య పెట్టే విధంగా సాక్షి రాతలు ఉన్నాయని అన్నారు. ఈపాటికి జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబానికి నోటీసులు అంది ఉండాలని, వివేకానంద రెడ్డి గారి హత్య కేసును సీబీఐ స్వీకరించిన తర్వాత ఆయన రాసిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు నివేదించగా అత్యంత ఒత్తిడిలో ఆయన లేఖ రాశారని వెల్లడించడం జరిగిందని అన్నారు.

వివేకానంద రెడ్డి గారితో తాము బలవంతంగా లేఖ రాయించామని హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న దస్తగిరి కూడా చెప్పారని, హత్య కేసులో లభించిన ఆధారాలతో దస్తగిరి వాంగ్మూలం సరిపోయిందని, అయినా దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కేసులో గూగుల్ టేక్ అవుట్ ఒక ఆధారం అని, లేని దాన్ని పట్టుకొని వైయస్ బ్రదర్స్ మాట్లాడుతున్నారని అన్నారు. హత్య చేసిన రాజశేఖర్ రెడ్డి గారిని కాపాడుకునేందుకు సునీతమ్మ గారు ప్రయత్నిస్తున్నారని అవినాష్ రెడ్డి గారు పేర్కొనడం విడ్డూరంగా ఉందని, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ అధికారిగా రామ్ సింగ్ గారిని మార్చాలని ఢిల్లీ వీధులలో తిరిగారని, రామ్ సింగ్ గారిని విచారణ అధికారిగా మార్చి వికాస్ సింగ్ గారిని నియమించిన తరువాతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు చేయడం జరిగిందని, విచారణ అధికారిని మార్చినంత మాత్రాన పరిస్థితి మారదని, తండ్రి అరెస్టు అనంతరం కంగారుపడి అవినాష్ రెడ్డి గారు కోర్టును ఆశ్రయించగా 15 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం కేసు కొట్టివేయడం జరిగిందని అన్నారు.

 

ఈ కేసులో సీబీఐ ఎటువంటి తప్పు చేయలేదని కోర్టు కితాబును ఇచ్చిందని, అయినా సుప్రీంకోర్టులో తులసమ్మ గారితో పిటిషన్ వేయించి, కేసు విచారణను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. తండ్రిని అరెస్టు చేసిన వారు కుమారుణ్ణి అరెస్టు చేయలేదు అంటే ఎక్కడో తేడా కొడుతుందని అన్నారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు గ్రహించారని, సుప్రీం కోర్టులో సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదని, అలాగే హైకోర్టులో కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు లేదని అన్నారు. ఒకవేళ చేసి ఉంటే మీడియాలో కథనాలు వచ్చి ఉండేవని, న్యాయస్థానాలలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోయినప్పటికీ వాదనలను మాత్రం సీబీఐ మనస్ఫూర్తిగానే వినిపిస్తోందని, అయితే సీబీఐ వైఖరిని చూస్తే అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేస్తుందని అనుకోవడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారని, సీబీఐ తన వైఖరిని ఎందుకు మార్చుకుందో అర్థం కావడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news