ఆర్ఆర్ఆర్ : తార‌క్ మ‌రియు ఆ ఇద్ద‌రు ? భ‌లే జోడీ వినండిక !

-

నాలుగు పాట‌లు మన‌తో మాట్లాడుతున్నాయి.ముఖ్యంగా మంగ్లీ గారు ఓ పాట పాడారండి ఆ పాట నాకెంతో ఇష్టం..(సారంగ‌ద‌రియా),మోహ‌న్ భోగ‌రాజు గారు (ఊరికి ఉత్తారాన‌) ఓ పాట పాడారండి నా చిత్రం కోసం ఆ పాట కూడా ఇష్ట‌మేనండి అని అన్నారు ఒక‌రు..మొద‌టి ఇష్టం చ‌ర‌ణ్ ది..రెండో ఇష్టం తార‌క్ ది..మ‌న తెలుగింటి బిడ్డ‌లు, వారి ప్ర‌తిభ అంటే మాకెంతో గౌర‌వం అని ప‌దే ప‌దే చెప్పారు వీరిద్ద‌రూ! ఇది క‌దా కావాలి.. మ‌రి! సినిమాలో దోస్తీ కుదిరింది ..ఆ పాట బాగుందండి కీరవాణి గారూ.. మీరు బాగా మా స్నేహాన్ని క‌థా గ‌మ‌న రీత్యా అర్థం చేసుకున్నారు అని ప్ర‌శంసించారు తారక్.. నా వ‌ర‌కూ జ‌న‌నీ పాట ఎంత న‌చ్చిందోనండి అని పొగిడారు చ‌ర‌ణ్.. ఆ రెండు పాట‌లూ విన్నాక ఇవాళ శ్రోత‌లంద‌రికీ ఎంతో ఆనందం.

పాటంటే ప‌ర‌వ‌శించి పోతాడు తారక్
మంచి పాట వింటే మురిసిపోతాడు చ‌ర‌ణ్
రామ్ చ‌ర‌ణ్ ఈ రెండూ పేర్లు విని
ఆంధ్రావ‌ని కూడా పుల‌కిస్తోంది
క‌న్న‌డ నేల దీవిస్తోంది
త‌మిళ గాలులు జోలలు పాడుతున్నాయి
ఉత్తరాది నేలలు వీరుల రాక‌ను స్వాగ‌తిస్తున్నాయి

అవును ! మ‌న పాట వింటే తార‌క్ కు ఎంతో ఆనందం. మ‌న తెలుగు గాయ‌కులు పాడితే పొంగిపోతాడు. మురిసిపోతాడు. కీర‌వాణి గారు ఎంత బాగా పాడారు ఆమె..ఎంత గొప్ప‌గా ఉంది ఆ పాట అంటూ అర‌వింద స‌మేత లో సినిమా స్థాయిని పెంచిన మోహ‌న్ భోగ‌రాజును ఉద్దేశించి ఎన్ని ప్ర‌శంస‌లు ఇచ్చారు.

ఎన్ని సార్లు కృత‌జ్ఞ‌త‌లు చెల్లించారో ! నేను ఆ సినిమా స్థాయిని పెంచిన పాట అదే అని అనుకుంటున్నానండి.. త్రివిక్ర‌మ్ ఆలోచ‌న అదే! వారి ఆలోచ‌న‌కు గాత్ర రూపం ఎంత బాగుంది అని చెప్పారు తారక్.. పాట పాడాక ఓ స్థాయి..విన్నాక మ‌రో స్థాయి..విని ప‌ర‌వ‌శం పొందాక పాట‌ల‌న్నీ కొత్త ఆనందాల‌కు ఆన‌వాలు అయితే లేదా పాత దుఃఖాల‌కు విరుగుడు అవుతాయి..వినండిక ఊరికి ఉత్త‌రాన పాటను..అస‌లు ఈ పాటను పెంచల దాసుగారు ఎంత బాగా పాడారో ..ఎంత గొప్పగా రాశారో.. పాట ఆత్మ‌ను అర్థం చేసుకుంటే మ‌న బిడ్డ‌లు గొప్ప గాయనీమ‌ణులు కావ‌డం త‌థ్యం అని నిరూపించిన వైనం త‌లుచుకుని పొంగిపోయారు తార‌క్.

మ‌నం అంతా ఆనందించాలి..మ‌నం అంతా మ‌రో మారు ఆ గాయ‌నికి జేజేలు ప‌ల‌కాలి..ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ లో ఇలాంటి మంచి మాట‌లు తార‌క్ చెప్పారు. అదేవిధంగా బాబాయ్ పాట ఇటీవ‌ల ఒక‌టి వ‌చ్చిందండి అఖండ సినిమాలో..యా ..యా ..యా..
జై బాల‌య్య ..ఈ పాట పాడిన ప‌ద్ధ‌తి ఎంత బాగుందో..గీతా మాధురి ఈ పాట పాడారు అండి..నాకెంతో న‌చ్చింది అండి..ఆర్ఆర్ఆర్ సినిమాలో దోస్తీ పాట నాకు చాలా న‌చ్చిందండి..అంటూ పాట‌ల‌పై త‌న‌కున్న మ‌క్కువ‌నూ ప్రేమ‌నూ చాటుకున్నారు.

ఇదే సంద‌ర్భంలో చ‌ర‌ణ్ స్పందిస్తూ..సారంగ‌ద‌రియా..పాట‌ను మంగ్లీ పాడిన ప‌ద్ధ‌తి త‌న‌కు న‌చ్చింద‌ని అన్నారు.మ‌గ‌ధీర కోసం బంగారు కోడి పెట్ట పాట‌ను రీ మిక్స్ చేసినా,ఓల్డ్ వెర్ష‌నే త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని అన్నారు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో జ‌న‌నీ పాట త‌న‌కెంతో న‌చ్చింద‌ని ఎన్ని సార్లు విన్నా త‌న‌కు కంట త‌డి వ‌స్తుంద‌ని చెప్పారు. ఈ పాట సినిమా విడుద‌ల‌య్యాక మ‌న తార‌క్ కు కూడా న‌చ్చుతుందండి అని అన్నారు కీర‌వాణి.

Read more RELATED
Recommended to you

Latest news