RRR TRAILER : ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ కు మూహుర్తం ఖరారు.. ఇక పూనకాలే షురూ

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది… ఒక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమానే. ప్రపంచ దృష్టిని ఆకర్షించే… విధంగా… దర్శక దిగ్గజం ఎస్‌ ఎస్‌ రాజమౌళి ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అనౌన్స్ మెంట్ డే నుంచే .. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.  అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ మూహుర్తం ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్‌ డిసెంబర్‌ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో ఫాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news