ఒమిక్రాన్ వైరస్ పై గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ సంచలన వ్యాఖ్యలు

-

ఒమిక్రాన్ వైరస్ పై గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ శోభన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వైరస్ భారతదేశంలో రాలేదని…. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అలాగని గుంపులు గుంపులుగా ప్రజలు గుమిగూడొద్దని… మాస్క్, సానీటైజర్, భౌతిక దూరం పాటించాలని సూచనల చేశారు. విదేశాల నుండి వస్తున్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించి, కోవిడ్ పాజిటివ్ ఉన్న వారిని పర్యవేక్షణలో పెడుతున్నామని… ఒమిక్రాన్ జినోమ్ సీక్వెన్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.

ఒమిక్రాన్ వైరస్ తీవ్రత ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని… ఒమెక్రన్ వైరస్ కేసులు వచ్చినా… ప్రభుత్వ సహకారంతో వైద్య సిబ్బంది అలెర్ట్ గా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గిందని… ప్రతీ ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. థర్డ్ వేవ్ వల్ల పిల్లలకు మాత్రమే ప్రమాదం అనేది ప్రచారమే మాత్రమేనని స్పష్టం చేశారు గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్‌. ప్రస్తుతం దేశంలో డెల్టా వైరస్ కేసులు, కరోనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు వెలుగు చూస్తున్నాయని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news