గన్‌తో సెల్ఫీ తీసుకోవాలనే ప్రయత్నం ఓ బాలుడి ప్రాణం తీసింది. కెమెరా స్విచ్‌కు బదులు గన్ టిగ్గర్ నొక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటన కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని లిసారి గేట్ ప్రాంతంలో చోటుచేసుకున్నది. ఉవేశ్ అహ్మద్(14)గా లోడ్ చేసిన గన్ తీసుకుని సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. తలపై గురిపెట్టుకోగా ఒక్కసారి గన్ పేలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం ఉవేశ్ అహ్మద్ అన్న సుహేల్‌కు నేర చరిత్ర ఉన్నది. ఇటీవల దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఉవేశ్ అహ్మద్ కాల్చుకున్న గన్ అతనికి సంబంధించిందిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గన్ అతని చేతికి ఎలా వచ్చిందనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. లోడ్ చేసిన గన్ ట్రిగ్గర్‌ను అనుకోకుండా నొక్కడంతోనే ఉవేశ్ అహ్మద్ ప్రాణాలను కోల్పోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.