రమ్య కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత

-

గుంటూరు : జీజీహెచ్‌ లో రమ్య తల్లిదండ్రులను పరామర్శించారు హోంమంత్రి సుచరిత. ఈ సందర్భంగా రమ్య తల్లిదండ్రులకు రూ. 10 లక్షల చెక్కను అందజేశారు. అనంతరం హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ… దిశ చట్టం వచ్చిన తర్వాత 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవుతుందని… ఎఫ్ ఎస్ ఎల్ ల్యాబ్ లను తొందరగా ఏర్పాటు చేస్తామన్నారు. సిఎం నిధులు కూడా ఇచ్చారని… తాడేపల్లి ఘటనలో నిందితులను గుర్తించి ఒకరిని పట్టుకున్నామని స్పష్టం చేశారు.

నిందితులను పట్టుకోవటం కష్టమైన ఒకరిని పట్టుకున్నామన్న ఆమె… సిఎం వెంటనే స్పందించి నిందితులను పట్టుకోమని పోలీసులను ఆదేశించారని వివరించారు. ఒక్క నిందితుడు కూడా తప్పుకోవటానికి వీలు లేదని సిఎం చెప్పారన్నారు. పార్లమెంట్ లో దిశ చట్టం అయితే ప్రత్యేక న్యాయ స్థానాలు అందుబాటులో కి వస్తాయని… సిసికెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడని అరెస్ట్ చేశామని వివరించారు. సురక్షితంగా లేని ప్రదేశాలకు వెళ్ళకూడదని ప్రజలు భావించాలని… వ్యక్తిగత భద్రత పాటించాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్ లైలా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version