మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా..!

-

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేల  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని క్యాద్గిరా గ్రామం ప్రజలు దాన్ని అరికట్టేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.. ఆ గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధించాలని, ఎవరైనా మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా విధించాలని సర్పంచ్ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలోని అన్ని బెల్ట్ షాపులను మూసివేయాలని గ్రామ కార్యదర్శి నోటీసులు జారీచేశారు. తీర్మాన పత్రాన్ని బషీరాబాద్ ఎస్సై కు అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news