యాపిల్ ఫోన్ అంటే మినిమమ్ ఉంటది. ఇంకా రూ. 30వేల విలువైన యాపిల్ ఐఫోన్ 7 కేవలం రూ. 15వేలకే వస్తుందంటే.. ఎవరైనా సరే కొనకుంటా ఆగుతారా.. ఐఫోన్ వాడాలనేది అందిరి డ్రీమ్. వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ రిఫర్బిష్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.
మనకు ఏదైనా తక్కువగా వస్తుందంటే.. ముందు క్వాలిటీ ఎలా ఉంటుందోలే అనే సందేహం ఉంటుంది.. అయితే రిఫర్బిష్ ఫోన్లని క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవసరం లేదని చెబుతోంది ఫ్లిప్ కార్ట్. ఈ స్మార్ట్ ఫోన్‌లను అమ్మకానికి తీసుకొచ్చే ముందు 47 రకాల తనిఖీలు చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. మరి ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్స్ వివరాలు ఇవే..
పీక్సెల్ 3ఏ..
64 జీబీ ఫోన్ రూ. 10,789కి లభిస్తుంది. ఈ ఫోన్‌లో 5.6 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 670 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 3000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్..
గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్ రిఫర్బిష్ ఫోన్ రూ. 13,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.3 ఇంచెస్ క్యూహెచ్‌డీ+డిస్‌ప్లేను ఇస్తున్నారు. 12 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 3430 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
యాపిల్ ఐఫోన్ 6ఎస్..
ఐఫోన్ 6 ఎస్ 64 జీబీ ఫార్మట్ రూ. 10,899కి అందుబాటులో ఉంది. ఇందులో 4.7 ఇంచెస్ రెటినా డిస్‌ప్లే టచ్‌ఐడీని అందించారు. ఈ ఫోన్‌లో 12 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఐఫోన్ 6ఎస్‌లో ఏ9 చిప్‌సెట్‌ను అందించారు. ఇక 16 జీబీ విషయానికొస్తే రూ. 9,999కి అందుబాటులో ఉంది.
యాపిల్ ఐఫోన్ 7..
యాపిల్ ఐ ఫోన్ 7 రిఫర్బిష్ సేల్‌లో భాగంగా రూ. 14,529కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 8లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ఏ10 ఫ్యూజియన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.