చంద్రబాబుకు పట్టిన గతే పీయూష్ గోయల్ కు పడుతుంది : బాల్క సుమన్

-

రైతులతో పెట్టుకున్నోడు ఎవరు బాగుపడలేదని గుర్తు చేశారు బాల్క సుమన్. అప్పుడు చంద్రబాబు రైతులతో పెట్టుకొని బాగుపడలేదు..పీయూష్ గోయల్ కళ్ళు నెత్తికి ఎక్కాయని ఫైర్ అయ్యారు. ఇప్పుడు అతనికే అదే గతి పడుతుందని హెచ్చరించారు. బుద్ధి అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలను కండిస్తున్నామని.. బీజేపీ తన బాధ్యతలను విస్మరించి దుర్మార్గంగా రైతుల పొట్ట కొడుతున్నారని నిప్పులు చెరిగారు.

తెలంగాణ రైతులను ,ప్రజలను అవహేళన చేస్తూ కించపరుస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటలను ఖండించాల్సిన నాయకులు వత్తాసు పలుకుతున్నారని అగ్రహించారు. వన్ నేషన్ వన్ ప్రోక్యూర్ మెంట్ పాలసీ ఎందుకు ఉండొద్దు..వరి పండించండి అని బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

కేంద్రం తో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత నాది అని సంజయ్ అన్నారు..ఇది తెలంగాణ బీజేపీ నాయకుల నిజ స్వరూపమని చురకలు అంటించారు. ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం కనీస బాధ్యత అని.. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైతులను ప్రజలను ఇబ్బందులు పెట్టడం ద్వారా రాక్షస ఆనందం పొందుతున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటికీ అయిన తెలంగాణ బీజేపీ కి ప్రజల మీద ప్రేమ ఉంటే మీ అధిష్టానం పై ఒత్తిడి తీసుకురండి..పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే బిజేపీ భరతం పడుతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news