వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు.. వీడియో వైరల్

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలతో నదులు మరియు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చాలా చోట్ల రవాణా కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.   అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే మానేరు వాగు పై ఉన్న లో లెవెల్ వంతెనపై నిన్న ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది.

ఇవాళ ఉదయం ప్రవాహ ఉధృతి మరింత పెరగ డంతో బస్సు… ఆ వాగులో కొట్టుకుని పోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సులు బయటకు తీసేందుకు అధికారులు సాహసించలేదు. దీంతో బస్సు పూర్తిగా ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయింది. ఇక నిన్న నీటిలో చిక్కుకున్న సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వీరందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అధికారులు. నిన్న బస్సులు జెసిబి సహాయంతో తీసేందుకు ప్రయత్నించిన.. అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి.