మంత్రి సబితా ఇంటి దగ్గర ఉద్రిక్తత

-

పాఠశాలల పున ప్రారంభాన్ని నిరసిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు మంత్రి సబిత ఇంటి వద్దకు మహిళా కాంగ్రెస్ నాయకురాలు వచ్చారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఇంటి ముందు నాయకులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి సబిత ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలను ప్రారంభించ వద్దంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు..

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో 20 మంది బృందం మంత్రి నివాసానికి చేరుకొని మంత్రి అందుబాటులో లేకపోవడంతో నివాసం వద్ద బైఠాయించారు. మంత్రి వచ్చే వరకు కదిలేది లేదంటూ నివాసం వద్ద బైఠాయించారు. ఎంపీ సంతోష్ కుమార్ కు లబ్ధి చేకూర్చేందుకే పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలలను ప్రారంభిస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఉపాధ్యాయులకు పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు పాఠశాలలను పునః ప్రారంభించ వద్దంటూ డిమాండ్ చేశారు నేతలు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నేతలు. శాంతియుతంగా మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news