ఆర్టీసీ కార్గో సర్వీసులో మృత పిండం.. సంచలన విషయాలు వెలుగులోకి !

-

వస్తు రవాణా ఆర్టీసీ ప్రారంభించిన కార్గో సర్వీసుల్లో మృత పిండాన్ని తరలించడం నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన వారం తర్వాత వెలుగుచూసింది. ఈ విషయం మీద పార్సిల్ కౌంటర్ ఇంచార్జి అన్వేష్ స్పందిస్తూ ఈనెల 23వ తేదీన నల్లగొండ నుండి ఎంజీబీఎస్‌ కౌంటర్ కు వచ్చిన పార్సిల్ వచ్చిందని కొంతసేపటికే పార్సిల్ నుండి దుర్వాసన రావడాన్ని సిబ్బంది గమనించి చెప్పారని అన్నారు. పార్సిల్ బుక్ చేసిన వారిని ఆరా తీశాము.

తరువాత అధికారులకు సమాచారం అందించామని అన్నారు. నల్లగొండలోని రివేరా డయాగ్నొస్టిక్ సెంటర్ నుండి పార్సిల్ వచ్చిందని, హైదరాబాద్ లోని యూనిక్ ప్యాక్ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు డెలవరీ కావాల్సి ఉందని అన్నారు.  మురళీ అనే వ్యక్తి ఆ పార్సిల్ ను తీసుకొనీ పోయాడన ఆయన పార్సిల్ ల్లో 8 నెలల మృతపిండం ఉన్నట్లుగా చెప్పాడని, పరీక్షల కోసం పార్సిల్ చేశారని చెప్పాడని అన్నారి. ఇతర జిల్లాల నుండి రెగ్యులర్ గా డయాగ్నొస్టిక్ పార్సిల్స్‌ వస్తుంటాయని, పార్సిల్ ను తెరిచి చూడము.. అనుమానం ఉంటే అధికారులకు చెబుతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news