తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్.. పెరగనున్న ఆర్టీసీ చార్జీలు..!

-

తెలంగాణ ప్రజలకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది ఆర్టీసీ. తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. పల్లె వెలుగుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర సర్వీసులకు 30 పైసలు పెంచాలని ప్రతిపాదనలు తయారు చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 9750 బస్సులను ఆర్టీసీ 3080 రూట్లను నడిపిస్తున్నామని…
రోజు 33 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ 32 లక్షల మంది ప్రయాణికులను ప్రతి రోజు తరలిస్తున్నామన్నారు. గతంలో 20 పైసలు అన్ని బస్సులకు పెంచడం జరిగింది.. ఆ డబ్బులు ఆర్టీసీ కి చేరలేదని తెలిపారు. మార్చి నుండి కరోనా.. తరువాత వచ్చిన సెకండ్ వేవ్ వల్ల ఆర్టీసీ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటుందని తెలిపారు.

251 మంది ఆర్టీసీ సిబ్బంది బస్సులు నడపడం వల్ల కరోనా సమయంలో మరణించారన్నారు. రెండు సంవత్సరాలుగా డీజిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయి.. రూ. 63.8 డీజిల్ ఉండేది..ఇప్పుడు 87 రూపాయలు ఉంది..27 రూపాయలు అధికంగా పెరిగిందని గుర్తు చేశారు. స్పెర్ పార్ట్శ్ కూడా భారీగా పెరిగాయి..ఈ సంవత్సరం రూ. 1400 కోట్లు ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు నష్టం వచ్చిందన్నారు. పల్లె వెలుగు, ఆర్డినరి కు 25 పైసలు.. రాజధాని ,ఎక్స్ ప్రెస్,గరుడ సర్వీసులకు లకు 30 పైసలు పెంచాలని మేము ప్రతిపాదనలు పెట్టామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ప్రతిపాదనలు పంపామని.. త్వరలోనే.. ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news