ఓమిక్రాన్ ఎఫెక్ట్: ఆ దేశ ప్రయాణికులకు వారం రోజులు క్వారంటైన్..

-

ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వణికిస్తోంది. ఓమిక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు తమ బోర్డర్లను క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఓమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో మొదలైన ఓమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం 18 దేశాలకు పాకింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఓమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరిస్తోంది.

మన దేశం కూడా ఓమిక్రాన్ పై అప్రమత్తం అయింది. ఇండియాలో ఇప్పటి వరకు ఒక్క ఓమిక్రాన్ కేసు లేకపోయినా .. జాగ్రత్తగా ఉండాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తోంది.  అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులపై ముఖ్యంగా హై రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి తప్పిని సరిగా ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు చేయాలని ఆదేశించింది.

విమానం

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓమిక్రాన్ వేరియంట్ పై అప్రమత్తం అయింది. ఈ వేరియంట్ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా 7 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఆంక్షలు విధించింది. ఎవరైనా ప్రయాణికుడికి ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ వస్తే.. ఆసుపత్రికి పంపించనున్నారు. నెగిటివ్ వస్తే ప్రయాణికుడిని 7 రోజులు క్వారంటైన్ లో ఉంచనున్నారు. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్​వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్​, ఇజ్రాయెల్​..దేశాల నుంచి వచ్చే వారికి ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news