ప్రైవేట్‌ డ్రైవర్లపై ఆర్టీసీ కార్మికుల రాళ్ల దాడి.. ఏం జ‌రుగుతోంది..

-

ముందు ప్రకటించినట్లే 5వ తేదీ శనివారం ఉదయం 5 గంటల నుంచి సమ్మె ప్రారంభించారు. చర్చలు విఫలమైన వెంటనే సమ్మె మొదలైనట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులను సంఘాలు అప్రమత్తం చేశాయి. ఈ క్ర‌మంలోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె దిగ్విజయంగా కొనసాగుతోందని అన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి. అయితే ప్రైవేట్‌ డ్రైవర్లపై ఆర్టీసీ కార్మికుల రాళ్ల దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది.

అచ్చంపేట బస్‌ డిపో దగ్గర బస్సులు నడుపుతున్న ప్రైవేట్‌ డ్రైవర్లపై ఆర్టీసీ కార్మికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఆర్టీసీ కార్మికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news