ఆర్టీసీ కార్మికుల ముందు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి…?

-

ఆర్టీసీ కార్మికుల ముందు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి…? ఇప్పుడు దీనిపైనే అందరి చర్చ… సమ్మె రాజకీయం ఇవన్నీ పక్కన పెట్టి… ఒక సాధారణ, సామాన్య కుటుంబ బాధలను ఒక్కసారి చూస్తే… ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సమ్మె నిర్వహిస్తున్న జేఏసీకి గాని, మాట వినని ప్రభుత్వానికి ఏ లోటు లేదు. హైకోర్టు లో వాదనలు వైన్ జడ్జికి గాని, వాదనలు వినిపించే న్యాయవాదులకు గాని, సమ్మెకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీల నాయకులకు గాని, ఆ వార్తలు అందిస్తున్న మీడియాకు గాని,

ఏ విధమైన నష్టాలు లేవు, అంతిమంగా నష్టపోతుంది కార్మికుడే. సమ్మె అంగీకరించి బస్సు దిగడం అనేది… కార్మికుడికి ఇష్టమా…? పంట మద్దతు ధర పెంచమని రైతు వ్యవసాయం మానేసి అడిగితే…? పెట్రోల్ ధరలు తగ్గించమని బండి వాడకుండా వాహనదారుడు అడిగితే…? నష్టపోయేది రైతే, వాహనదారుడే. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా ఇదే జరుగుతుంది… కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా సరే జీతాలు పడుతున్నాయి… ప్రభుత్వ సాయమే అందిస్తుందో అప్పులే చేసి చెల్లిస్తున్నారో జీతాలు పడుతున్నాయి.

ఆ జీతాలు పెంచమని లేదా తమ డిమాండ్లు అంగీకరించమని సమ్మె ఆపేసి నిరసన తెలిపితే…? అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించాలి, స్కూల్ కి వెళ్తున్న పిల్లాడికి ఫీజు కట్టాలి, కూతురి పెళ్లి దగ్గరకు వస్తుంటే రూపాయి రూపాయి పోగు చేసుకోవాలి. ఒక పక్క కుటుంబ పోషణ భారాన్ని నెత్తి మీద మొయ్యాలి… ఇలా ఒకటి కాదు రెండు కాదు… పదుల సంఖ్యలో కుటుంబ సమస్యలు ఉంటాయి. మూడు నెలల నుంచి జీతాలు అందడం లేదు… ఎవడూ దానికి సమాధానం చెప్పే సాహసం చేయడు, అప్పులు చేసి కుటుంబాన్ని నడపాలి, తాజాగా హైకోర్టు కూడా చేతులు ఎత్తేసినట్టే కనపడుతుంది.

తమకు కొన్ని పరిధులు ఉంటాయని ఇలాగే చెయ్యాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమీషనర్ కు ఆదేశించింది. దీనితో ఇప్పుడు కార్మికులకు కుటుంబాల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కార్మికులు కూడా ప్రభుత్వం లోంగే అవకాశం లేకపోవడంతో, సమ్మెను విరమించాలి అనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కార్మికుల ముందున్న ప్రత్యామ్నాయ మార్గం సమ్మెను విరమించడమే అనేది పరిశీలకుల మాట. ఇప్పుడు విధుల్లోకి చేరితే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉండదని వారు భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news