తెలంగాణలో ముందుగా ప్రకటించినట్టుగా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు నుండే రుణమాఫీ రెండో విడత నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయనుంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈరోజు 25 వేల నుండి 26 వేల మధ్య లోన్ ఉన్న వారి ఖాతాలో నిధులు వేస్తారు. ఇక రెండో రోజు రూపాయలు 26 వేల నుండి 27 వేల మధ్య లోన్ తీసుకున్న వారి ఖాతాలో నిధులను వేస్తారు.
మూడో రోజు 28 వేల కు పైగా తీసుకున్న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఇలా రోజుకు వెయ్యి రూపాయలు పెంచుతూ…ఈనెల 30 వరకు మొత్తం 50 వేల లోపు ఉన్న రైతులందరు ఖాతాల్లోకి నిధులను విడుదల చేస్తారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం ఆన్లైన్ లో పోల్చి ఆ తరవాత అర్హులను ఎంపిక చేయనున్నారు. రైతుల రుణమాఫీ అనంతరం మళ్లీ వెంటనే బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి రైతులు తిరిగి రుణాలను పొందవచ్చు.