ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నీటి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్జీటీ వరకు వెళ్ళిన గొడవ, ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ తయారు చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యుత్ తయారు చేయడానికే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం కామెంట్లు చేసుకున్నాయి. అటు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో తప్పులు ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేసింది.
ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనకు కేఆర్ఎంబీ ముందుకు వచ్చింది. ఇదంతా జరిగిన తర్వాత తాజాగా, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో విచారణ జరగనుంది. ఈ విషయంలో ఈ రోజు విచారణ చేపట్టనున్నారు. మరి ఈ విచారణలో ఏం తేలుతుందో చూడాలి. దీనిపై సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు. మరో పక్క ప్రతిపక్షాలు మాట్లాడుతూ, నీటి వివాదం రాజకీయాల కోసమే పైకి తీసుకొచ్చారని కామెంట్లు చేస్తున్నారు.