విశాఖలోని ఋషికొండ బీచ్ కు అదుడైన ఘనత దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్లూ ఫాగ్ బీచ్ ల సరసన విశాఖ రుషికొండ బీచ్ కూడా తాజాగా చేరింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చినందుకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని బీచ్ లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. అయితే ఇండియాలో 8 బీచ్ లకు ఇప్పటి దాకా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. ఇప్పుడు విశాఖ ఋషికొండ బీచ్ తొమ్మిదవ బీచ్ గా నిలవనుంది. ప్రపంచంలోనే 50 బ్లూ ఫ్లాగ్ బీచెస్ లో పొల్యూషన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ లో కూడా మూడో స్థానం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈమేరకు బ్లూ ఫాగ్ బీచెస్ ఇండియా మిషన్ లీడర్ ప్రకటన విడుదల చేసింది.