ఫిన్ లాండ్, స్వీడన్ లకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్… ఆ పని చేస్తే యద్ధం తప్పదంటూ హెచ్చరిక

-

ఉక్రెయిన్ పై రష్యా భీకర పోరు సాగిస్తోంది. మిలిటరీ యాక్షన్ అని చెప్పినప్పటికీ.. తీవ్ర స్థాయి యుద్ధంగా మారింది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబు దాడులు చేసింది. మరోవైపు రాజధాని కీవ్ ను ఆక్రమించుకుంది రష్యా. ఉక్రెయిన్ ను మొత్తాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా ముందడుగు వేస్తోంది. ప్రపంచదేశాల ఆంక్షలకు అస్సలు భయపడటం లేదు. 

ఇంతటి యుద్ధానికి కారణం ఉక్రెయిన్ ‘నాటో’ కూటమిలో చేరుతా.. అని చెప్పడమే. నాటోలో చేరితే తన రక్షణ, సార్వభౌమాధికారానికి విఘాతం ఏర్పడుతుందనే ఆలోచనలో రష్యా ఉంది… దీంతోనే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకముందే.. యుద్ధం ప్రకటించింది. ఇదిలా ఉంటే మరో రెండు దేశాలకు కూడా రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఫిన్ లాండ్, స్వీడన్ దేశాలు నాటో కూటమిలో చేరాలనుకుంటే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. యుద్ధానికి కూడా వెనకాడమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్వీడన్, ఫిన్ లాండ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version