Zelensky : చ‌ర్చ‌లు జ‌ర‌పాలంటే ఫ‌స్ట్ బాంబులు వేయ‌డం ఆపండి..!

-

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య వారం రోజుల నుంచి పోరు న‌డుస్తూనే ఉంది. ఓవైపు చ‌ర్చ‌ల‌ను పిలుస్తూనే.. మ‌రొక‌వైపు ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని పోరు హోరాహోరిగా కొన‌సాగిస్తున్నాయి. దూసుకొస్తున్న ర‌ష్యాను ఉక్రెయిన్ అడ్డుకుంటుంది. ఈ త‌రుణంలో కాల్పుల విర‌మ‌ణపై అర్థ‌వంత‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌డానికి ముందు న‌గ‌రాల‌పై బాంబు దాడుల‌ను నిలిపివేయాల‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ డిమాండ్ చేసారు. ఆయ‌న అంత‌ర్జాతీయ మీడియా సంస్థల వేదిక‌గా స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్ వైపు వేగంగా క‌దులుతున్నాయి.

క‌నీసం ప్ర‌జ‌ల‌పై బాంబు దాడుల‌ను నిలిపివేయ‌డం అవ‌స‌రం. దాడుల‌ను ఆపి చ‌ర్చ‌ల‌ను ప్రారంభించాల‌ని రెండ‌వ ద‌ఫా చ‌ర్చ‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఉక్రెయిన్ వైఖ‌రిని జెలెన్ స్కీ వెల్ల‌డించారు. ర‌ష్యా వైమానిక ద‌ళాల‌ను నిలువ‌రించేందుకు నో ఫ్లై జోన్ విధించాల‌ని ఆయ‌న నాటో స‌భ్యుల‌ను కోరారు. వాస్త‌వం చెప్పాలంటే ర‌ష్యా మూలంగా ప్ర‌తి ఒక్క‌రూ ఈ యుద్ధంలోకి రావాల్సి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకునే అవ‌కాశం లేక‌పోతే త‌మ దేశానికి చ‌ట్ట‌ప‌ర‌మైన భ‌ద్ర‌త‌కు హామి ఉండాల‌న్నారు.

ఉక్రెయిన్ కోసం భ‌ద్ర‌తా హామీల‌ను సిద్ధం చేయాలి. దీని ద్వారా మా దేశ స‌రిహ‌ద్దుల‌కు ర‌క్ష‌ణ ఉంటుందని.. పొరుగు దేశాల‌తో ప్ర‌త్యేక సంబంధాలుంటాయ‌ని మేము అర్థం చేసుకుంటాం అని జెలెన్ స్కీ వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news