ఉక్రెయిన్- రష్యా వార్: ఈయూ నుంచి ఉక్రెయిన్ కు పెరిగిన ఆయుధాల సరఫరా..

-

ఉక్రెయిన్- రష్యా మధ్యల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిన్నటి చర్చలతో యుద్ధానికి అడ్డుకట్ట పడుతుందని అనుకున్నా… అందుకు భిన్నంగా మరింత తీవ్రం అయింది. నగరాలే లక్ష్యంగా రష్యా భారీగా మిసైల్ స్ట్రైక్ చేస్తోంది. కీవ్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యన్ ఆర్మీ సిద్ధం అయిందని తెలుస్తోంది. ఉక్రెయిన్ బలగాలు రష్యాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ తన శాటిలైట్ ను ఉపయోగించి రష్యా దళాల మోహరింపును ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ కు తెలియజేస్తోంది.

ఇదిలా ఉంటే ఈయూ నుంచి భారీగా ఆయుధాలు అందుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల నుంచి మిస్సైల్స్ అందించాయి. తాజాగా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరాను మరింత వేగవంతం చేసింది యూరోపియన్ యూనియన్. 70 యుద్ధవిమానాలతో మరింత బలోపేతం కానుంది ఉక్రెయిన్. బల్గేరియా నుంచి 16 మిగ్-29 విమానాలతో పాటు పోలాండ్ నుంచి 28 మిగ్ -29 యుద్ధవిమానాలు అందనున్నాయి.  ఈ విమానాలు అందితే ఉక్రెయిన్ మరింతగా పోరాడే సామర్థ్యం ఏర్పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news