ఉక్రెయిన్ పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. మొన్నటి వరకు తూర్పు ప్రాంతంలోనే దాడులు చేసిన రష్యా… ప్రస్తుతం యూరప్ దేశాల సరిహద్దుల్లోని పశ్చిమ ప్రాంతాల్లోని నగరాలపై కూడా దాడులు చేస్తోంది. నిన్న పోలాండ్ సరిహద్దుల్లోని ఎల్వివ్ నగరంపై క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడితో చాలా మంది మరణించారు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ ను మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే నాటోపై రష్య దాడి చేస్తుందని అన్నాడు. రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ ను తీసుకెళ్లే పైప్ లైన్ మాస్క్ నార్డ్ స్ట్రీమ్ 2 ని టార్గెట్ చేస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉంటే గతంలో రష్యా నాటో దేశాలకు, యూరోపియన్ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ పై నోఫ్లైయింగ్ జోన్ ఏర్పాటు చేస్తే వారిని రష్యాకు శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చిరించింది. రష్యాకు వ్యతిరేఖంగా యుద్ధంలో దిగినట్లే భావిస్తామని హెచ్చిరించింది.