రష్యా దాడి సంతోషాన్ని ఇచ్చింది… పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

-

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన యుద్ధోన్మాదాన్ని ప్రకటించాడు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చిందంటూ… రష్యా దాడి సంతోషాన్ని కలిగించిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిని సమర్థించారు ఇమ్రాన్ ఖాన్.

 

ప్రస్తుతం ఈ సంక్షోభ పరిస్థితుల సమయంలో రష్యా పర్యటనలో ఉన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఈరోజు ఇమ్రాన్ ఖాన్ రష్యా మాస్కో వెళ్లారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని పరిష్టం చేసుకునేందుకు రష్యా పర్యటనకు వెళ్లారు ఇమ్రాన్. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత రష్యాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ రికార్డ్ క్రియేట్ చేశారు. రష్యాకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ కు ఆదేశం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఇమ్రాన్ ఖాన్ తో పాటు విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, సమాచార మంత్రి ఫవాద్ చౌదరి, ప్రణాళిక మరియు అభివృద్ధి మంత్రి అసద్ ఉమర్, వాణిజ్య సలహాదారు అబ్దుల్ రజాక్ దావూద్ మరియు జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ మొయీద్ యూసుఫ్ రష్యా పర్యటనకు వెళ్లారు.

 

Read more RELATED
Recommended to you

Latest news