వాట్సాప్ గ్రూప్ లపై కేరళ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వాట్సాప్ గ్రూపులలో వచ్చే టు వంటి అసభ్య కరమైన పోస్టులు, మత సామరస్య వీడియోలు, ఇతర ఫోటోలకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు ఎలాంటి సంబంధం ఉండదని.. ఇందులో దోషిగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ను చూడలేమని కేరళ హై కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది.
చైల్డ్ పోర్నోగ్రఫీని పోస్ట్ చేసిన కేసులో తాజాగా కేరళ హై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలో.. ప్రెండ్స్ అనే వాట్సాప్ గ్రూప్ ను ఓ వ్యక్తి క్రియేట్ చేశాడు. ఆ వాట్సాప్ గ్రూప్ లో.. తన స్నేహితులతో పాటు.. తనకు తెలిసిన వారిని సభ్యులుగా యాడ్ చేశాడు. అయితే.. ఆ వాట్సాప్ గ్రూప్ లోని ఓ సభ్యుడు ఫోర్న్ వీడియో పెట్టాడు.
దీంతో ఆ గ్రూప్ లోని ఓ సభ్యుడు.. అడ్మిన్ పై కేసు వేశాడు. అయితే.. ఆ కేసును ఇవాళ కేరళ హై కోర్టు విచారణ చేసింది. వాట్సాప్ గ్రూపులలో వచ్చే టు వంటి అసభ్య కరమైన పోస్టులు, మత సామరస్య వీడియోలు, ఇతర ఫోటోలకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు ఎలాంటి సంబంధం ఉండదని..ఆ కేసును కొట్టివేస్తూ.. తీర్పు ఇచ్చింది కోర్టు.