ఉక్రెయిన్, రష్యా చర్చల్లో కీలక ముందడుగు… త్వరలో పుతిన్, జెలన్ స్కీ భేటీ..!

-

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభం అయి 35 రోజుల అవుతున్నాయి. బెలారస్, టర్కీ వేదికగా యుద్దం ఆపడానికి శాంతి చర్చలు జరిగాయి. అయితే గతంలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే నిన్న టర్కీ ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో కీలక ముందడుగు పడింది. కీవ్, చెర్నివ్ ప్రాంతాల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కూడా నాటోలో చేరకుండా… తటస్థత పాటిస్తామని జెలన్ స్కీ ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉంటే తమ రక్షణకు అంతర్జాతీయ హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య త్వరలోనే భేటీ ఉంటుందని తెలుస్తోంది. యుద్ధం ముగియాలంటే పుతిన్ లో ముఖాముఖీ జరిగితేనే సాధ్యం అంటూ జెలన్ స్కీ పలుమార్లు ప్రకటించారు. ఈ భేటీ జరిగితే యుద్ధానికి త్వరలోనే ముగింపు పలికే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news