మాపై అణుయుద్ధానికి అమెరికా మిత్రదేశాలు సిద్ధం అవుతున్నాయి… రష్య విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

ఉక్రెయిన్- రష్యా మధ్య ఎనిమిదో రోజు యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ వల్లకాడులా మారిపోతోంది. అనేక భవనాలు శిథిలం అవుతున్నాయి. కీవ్, ఖార్కీవ్ నగరాల్లో అందమైన భవనాలు నెలమట్టం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రష్యన్ సేనలకు అంతే స్థాయిలో ధీటుగా జవాబు ఇస్తోంది ఉక్రెయిన్. ఉక్రెయిన్ దేశానికి అమెరికా మిత్రదేశాాలు, నాటో, యూరోపియన్ యూనియన్లు నేరుగా యుద్ధం చేయకున్నా… సైనికపరంగా సహాయం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా దాని మిత్ర వేశాలు రష్యాపై అణు యుద్ధానికి సిద్ధం అవుతుందని బాంబ్ పేల్చాడు. ఇంతకు ఈయనే మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది న్యూక్లియర్ బాంబులతోనే అని అన్నాడు. యూరప్ ను కబ్జా చేసేందుకు అమెరికా కుట్ర చేస్తోందని అందుకే.. ఉక్రెయిన్ కు అండగా నిలుస్తుందని విమర్శించారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాస్త్ర విభాగాన్ని అలెర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఏ వైపుకు దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news