నిర్మ‌ల్ : హ‌రీశన్న వ‌స్తుండు ! అయితే…

-

జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ హ‌రీశ్ రావు లాంటి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను నిల‌దీయాల్సిందే!ఎందుకంటే వైద్యం మ‌రియు ఆరోగ్యం అన్న‌వి ఇవాళ ప్ర‌భుత్వ ప‌రిధిలో ప్ర‌శ్నార్థ‌కంగా ఉన్నాయి క‌నుక‌! తెలంగాణ ప్ర‌భుత్వం వీటికి నిధులు కేటాయిస్తున్నా ఫ‌లితాలు మాత్రం ఆశించిన రీతిలో లేవు.ఆ విధంగా చాలా చోట్ల క‌నీస వ‌స‌తుల‌కు కూడా నోచుకోని విధంగా ఆస్ప‌త్రులు ఉంటే జ‌బ్బులు ఎలా తగ్గుతాయి అన్న వాద‌న కూడా ఉంది. అందుకే మ‌రో వివాదం హ‌రీశ్ ను నెడితే, ప్ర‌భుత్వం దార్లోకి వ‌స్తుంది.వైద్య , ఆరోగ్య శాఖ‌లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తుంది.ఇందుకు ప్ర‌జాపోరాట‌మే శ‌ర‌ణ్యం.

నిర్మ‌ల్ ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో స్టాఫ్ న‌ర్సులు లేరు..102 మంది ఉండాలి కానీ 84 మంది ఉన్నారు అని ప్ర‌ధాన మీడియా గ‌గ్గోలు పెడుతోంది. ఇదే విధంగా ఆశా కార్య‌క‌ర్త‌లు కూడా 591మంది ఉండాలి కానీ 567 మంది మాత్ర‌మే ఉన్నారు.వీటి భ‌ర్తీ విష‌య‌మై ఇంత‌వ‌ర‌కూ ఓ ప్ర‌క‌ట‌న కూడా లేదు.

ప్ర‌ధాన పుణ్య‌క్షేత్రం బాస‌ర‌లో ముప్పై ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి ఏర్పాటుకు ఎప్ప‌టి నుంచో ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి.కానీ అవి ప‌ట్టింపులో లేవు. స‌కాలంలో వైద్యం అంద‌క చ‌నిపోతున్న దాఖలాలు ఉన్నా కూడా ప్ర‌భుత్వం మాత్రం త‌న దైన శ్ర‌ద్ధ‌ను ఈ ప్రాంతం వైపు ఉంచ‌డం లేదు. ఇవే కాకుండా చాలా చోట్ల కనీస వ‌స‌తుల‌కు నోచుకోని ఆస్ప‌త్రులు కోకొల్లుగా ఉన్నాయి.నిర్మ‌ల్ జిల్లా అనేకాదు ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఇదే విధంగా ద‌య‌నీయ‌త‌కు ఆన‌వాలుగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులున్నాయి.వీటిపై కూడా దృష్టి సారిస్తే హ‌రీశ్ రావు కు పేరు..తెలంగాణ రాష్ట్ర‌స‌మితికి కూడా పేరు..రావ‌డం ఖాయం.

వైద్య ఆరోగ్య శాఖ‌ను చూస్తున్న హరీశ్ రావుకు ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.గిరిజ‌న తండాల్లో మెరుగైన వైద్యం అన్న‌ది ఎప్ప‌టికీ అందుబాటులోకి రావ‌డం లేదు అన్న బాధ ఇవాళ అంద‌రిలోనూ ఉంది.అయినా కూడా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న వేద‌నతో విప‌క్షాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ‌లోఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకుంటే కొంత‌లో కొంత స‌మ‌స్య‌కు ప‌రిష్కారం.ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌కు ఆధునిక వ‌స‌తులు క‌ల్పిస్తే ఇంకా మేలు.ఇవేవీ చేయ‌కుండా జిల్లాల ప‌ర్య‌ట‌న పేరుతో చేసే హ‌డావుడి అన్న‌ది పెద్ద‌గా ఫ‌లితాలు ఇవ్వ‌ద‌ని విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి.ముఖ్యంగా బాస‌ర‌లో ప్ర‌భుత్వాస్ప‌త్రి ఏర్పాటు చేయాల‌ని,అదేవిధంగా మ‌హారాష్ట్ర‌,తెలంగాణ ప్రాంతాల‌కు కేరాఫ్ గా నిలిచే భైంసాలో కూడా ప్ర‌భుత్వాస్ప‌త్రికి ఓ కొత్త భ‌వ‌నం స‌మ‌కూర్చాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి.

కానీ వీటిపై టీ స‌ర్కార్ పెద్ద‌గా దృష్టి సారించిన దాఖ‌లాలు లేవు.ఇవాళ మంత్రి హ‌రీశ్ రావు నిర్మ‌ల్ కు పోతున్నారు. అక్క‌డ కొన్ని  అభివృద్ధి ప‌నులకు ముఖ్యంగా జిల్లా కేంద్రంలో  రెండు వేల ఐదు వంద‌ల ప‌డ‌క‌ల‌తో ఏర్పాటు చేయ‌నున్న ప్ర‌భుత్వాస్ప‌త్రికి శంకుస్థాప‌న చేసి రానున్నారు.ఇదే స‌మ‌యంలో ఈ జిల్లాలో క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌పై మంత్రి హ‌రీశ్ రావు దృష్టి సారించాలి అన్న ప్ర‌ధాన డిమాండ్ ఒక‌టి ప‌బ్లిక్ నుంచి వ‌స్తోంది.క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ల‌తో పాటు పలు ఆస్ప‌త్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి దృష్టి నిల‌పాలి అని,అదేవిధంగా ఎప్ప‌టి నుంచో ఖాళీగా ఉన్న సివిల్ స‌ర్జ‌న్, డిప్యూటీ సివిల్ స‌ర్జన్,అసిస్టెంట్ సివిల్ స‌ర్జ‌న్ వంటి పోస్టుల భ‌ర్తీకి స‌త్వ‌ర‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాన మీడియాలో కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news