ఈ రోజు గౌహతి వేదికగా జరుగుతున్న మూడవ టీ 20 మ్యాచ్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియాలు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆరంభంలోనే జైస్వాల్ మరియు ఇషాన్ కిషన్ ల రూపంలో వికెట్లు కోల్పోవడంతో మరో ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ నెమ్మదిగా ఆడుతూ చివరకు వచ్చేసరికి గేర్ మార్చాడు. ఈ సందర్భంలో ఋతురాజ్ గైక్వాడ్ కెరీర్ లోనే మొదటి సెంచరీ ని నమోదు చేసి రికార్డు సాధించాడు.. గైక్వాడ్ 52 బంతులను ఎదుర్కొని ఫోర్లు మరియు 5 సిక్సులు సహాయంతో 102 పరుగులు చేశాడు. లాస్ట్ మ్యాచ్ లోనూ అర్ద సెంచరీ తో మెరిసిన గైక్వాడ్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి ఇండియాకు మంచి స్కోర్ ను అందించగలిగాడు.
గైక్వాడ్ ఇన్నింగ్స్ లో ప్రత్యేకత ఏమైనా ఉందంటే… నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్ ను నిర్మించుకుని ఆ తర్వాత పరుగుల వరద సృష్టించడంలో నేర్పరి.