నిన్న బీసీసీఐ ఆసియా గేమ్స్ లో పాల్గొనే ఇండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జట్టుకు ఐపీఎల్ లో తన సత్తా చాటిన మహారాష్ట్ర క్రికెటర్ ఋతురాజ్ గైక్వాడ్ కు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. ఆసియా గేమ్స్ లో పాల్గొనే జట్టుకు కెప్టెన్ గా నియమిస్తూ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. మాములుగా గత రెండు వారల ముందు శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా చేస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ శిఖర్ ధావన్ కు కాప్తావుంబ్ కాదు కదా జట్టులో చోటు కూడా లేకపోవడం గమనార్హం. తనకు కెప్టెన్సీ రావడంతో ఋతురాజ్ గైక్వాడ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు, ఈయన సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ గా అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐకి కృతజ్ఞతను తెలిపాడు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తిమేరకు కృషిచేస్తానని మాటిచ్చాడు.
కాగా ఆసియ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే నా టార్గెట్ అంటూ గర్వంగా చెప్పాడు. మరి ఈ జట్టులో ఉన్న కుర్రాళ్లను సమర్ధవంతమగా లీడ్ చేసి ఇండియాకు ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ ను అందిస్తాడా చూడాలి.