బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ సీఎం కేసీఆర్ పైన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు, గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసి మరీ విమర్శలు చేశాడు. ఉచిత విద్యుత్ మీద గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీకి మరియు అధికార పార్టీకి వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఏదో ఒక విధంగా కౌంటర్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేసాడు. ఈయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ చంద్రబాబు తో కలిసి కారణం కాలేదా అంటూ ప్రశ్నించాడు. బాసీర్ బాగ్ కాల్పులు జరిగిన తర్వాత 9 నెలలపాటు టీడీపీలోనే కేసీఆర్ ఉన్నదంటూ గుర్తుచేశాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తన జీవితంలో ఎక్కువ భాగంగా కాంగ్రెస్ మరియు టీడీపీ ల మీదనే ఆధారపడ్డారని విమర్శించాడు. ఇలా చాలా విషయాలలో కేసీఆర్ కు కాంగ్రెస్ లేదా టీడీపీ సహాయపడింది. ఇవన్నీ మరిచిపోయి ఇప్పుడు కేసీఆర్ ఏదో సాధించినట్లు చవాక్కులు పేలుతున్నాడంటూ మాట్లాడారు రేవంత్ రెడ్డి.

ఇక ప్రజల గురించి మరియు రైతుల గురించి కేసీఆర్ చెబితే ఆలోచించే స్థాయిలో కాంగ్రెస్ లేదని గుర్తు చేశాడు రేవంత్ రెడ్డి. రైతులకు విద్యుత్ ఎంత అవసరమో కాంగ్రెస్ కు తెలుసని ఈ సందర్భంగా మరోసారి కేసీఆర్ కు గుర్తు చేశాడు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news