పుష్ప నుంచి మరో బిగ్ అప్డేట్.. సామి.. సామి సాంగ్ రిలీజ్

-

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేష‌న్లో హ్యాట్రిక్ సినిమాగా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది. ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.

పార్ట్ వన్ పుష్ప… డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది. ఇక వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ స్ట్రాంగ్ క్రియేట్ చేస్తోంది పుష్ప మూవీ యూనిట్. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక తాజాగా మూడో సింగిల్ ” సామి సామి ” ప్రోమో ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రోమో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే దీని పూర్తి సాంగ్ ను అక్టోబర్ 28 వ తారీఖున ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని పుష్ప చిత్ర యూనిట్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news